Questions


September 2021 1 27 Report
అది తెల్లదొరల పరిపాలనా కాలము. మన సాహితీ సంస్కృతులకు ఆదరణలేదు. మన సాహిత్యం అప్పటికే కొంత విదేశీయుల పాలయినది. మన సాహిత్యమంతా రాగి రేకులపై తాటి ఆకులపై వ్రాయబడి ఉండేది. సామాన్యుడికి ఆనాడు సాహిత్యం అందుబాటులో ఉండేది కాదు. మహారాజులు రామాయణాది గ్రంథాలను డబ్బిచ్చి వ్రాయించుకొని భద్రపరచుకొనే వారు

క్రమంగా ముద్రణాలయాలు అవతరించాయి. విజ్ఞానం వివిధ రీతులలో విస్తరించింది. 1746లో జర్మనీలో 'హాలీ' నగరంలో 'రెవరెండ్ బెంజిమన్ ఘాల్జీ' అనే ఫాదర్ తెలుగులో 'బైబిలు' ముద్రించాడు. 1772లో మద్రాసుకు ముద్రణాలయం వచ్చింది. 1807లో తెలుగు వ్యాకరణ గ్రంథం మొట్టమొదట అచ్చయింది. సి.పి.బ్రౌన్ నిరంతర దీక్ష కారణంగా పెక్కు తాటాకు గ్రంథాలు, వ్రాత పుస్తకాలు ముద్రణ భాగ్యమునకు నోచుకున్నాయి. 1820 లో పుదూరు సీతారామశాస్త్రిగారు పెద్ద బాల శిక్ష' అచ్చు వేశారు. 1827లో 'కాలేజిప్రెస్' వారి 'శబ్దమంజరి' తెలుగు లిపిలో అచ్చయింది. బ్రిటన్ లో ప్రచురణాలయాల వల్లనే వారి వాఙ్మయానికి ఒక చరిత్ర ఏర్పడింది. ఇంగ్లండులో 15వ శతాబ్దిలో వెలసిన 'కాక్సన్' ఆ దేశ సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. కాబట్టి ఒక దేశము యొక్క జాతీయత, ఆదర్శాలు, అభిలాషలు ప్రచారం కావాలంటే దానికి వాజ్మయమే సాధనం

నేడు కాలం మారింది. పూర్వంవలె సంస్కృతం చదివేవారు లేరు. భాషలో మార్పువస్తూ ఉన్నది. ప్రాచీన తాళపత్ర - వ్రాత కావ్యాలు సామాన్యులకు అర్థమయ్యే పరిస్థితిలేదు. అందరికీ మూల గ్రంథాలు చదివి అర్థం చేసుకొనే జ్ఞానం లేదు. అన్నింటికీ టీకలు. వ్యాఖ్యానాలు, అనువాదాలు, వివరణలు అవసరమయింది.

i. ఒకప్పుడు సామాన్యునికి ఏది అందుబాటులో ఉండేదికాదు?
అ) కథ
ఆ) సాహిత్యం
ఇ) రామాయణం
ఈ) భారతం
ii.పెద్దబాలశిక్షను అచ్చువేసినవారు ఎవరు
అ) గాజుల సత్యనారాయణ
ఇ) పుదూరు సీతారామశాస్త్రి-
ఆ) సిరివెన్నెల సీతారామశాస్త్రి-
ఈ) దేవులపల్లి కృష్ణశాస్త్రి

Answers & Comments


Add an Answer


Please enter comments
Please enter your name.
Please enter the correct email address.
You must agree before submitting.

Helpful Social

Copyright © 2024 EHUB.TIPS team's - All rights reserved.